టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే..

టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే..

రోడ్లు బాగుండాలంటే టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే అన్నారు కేంద్రమంత్రి నితన్ గడ్కరీ... మౌలికవసతుల రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారాయన. పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయంలో టోల్ ట్యాక్స్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు.. ప్రజలు టోల్ ట్యాక్స్ కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. టోల్ వ్యవస్థను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని వెల్లడించిన ఆయన.. టోల్ వ్యవస్థ కంటిన్యూ అవుతుందన్నారు. ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉన్నంత కాలం టోల్‌ వ్యవస్థ కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశారు. ఇక, టోల్‌ ద్వారా వసూలు చేసిన నిధుల్ని గ్రామీణ, కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తున్నామని చెప్పారు. ఐదేళ్లలో ప్రభుత్వం 40వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందని వివరించారు. అంతే కాదు, టోల్ వ్యవస్థ బంద్ కాదు. టోల్ ధరలు మారుతూ ఉండొచ్చు. ఒక్కోసారి ఒక్కో ధర ఉంటుంది. టోల్ ట్యాక్స్ నా బ్రైన్ చైల్డ్. మెరుగైన సేవలు కావాలని అనుకుంటే, ట్యాక్స్ కట్టాల్సిందే అని గడ్కరీ వ్యాఖ్యానించారు.