కొత్త వాహన చట్టంపై నితిన్ గడ్కారీ సంచలన వ్యాఖ్యలు..!!

కొత్త వాహన చట్టంపై నితిన్ గడ్కారీ సంచలన వ్యాఖ్యలు..!!

కొత్త వాహన చట్టం సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి అమలులోకి వచింది. ఈ వాహన చట్టం ప్రకారం...నిబంధనలకు అనుగుణంగా వాహన దారుల పత్రాలు లేకుంటే.. భారీ జరిమానాలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హెల్మెట్ లేకపోతే రూ.1000 రూపాయలు కట్టడం ఏంటి అని వాపోతున్నారు. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు.

అంతేకాదు, లైసెన్స్ లేకున్నా జరిమానాలు భారీగా ఉన్నాయి. దీంతో కేంద్రంపై విమర్శలు ఎదురౌతున్నాయి. ఈ విమర్శలపై నితిన్ గడ్కారి స్పందించారు. కేంద్రం చట్టాన్ని తీసుకొచ్చిందని.. వాటిని రాష్ట్రప్రభుత్వాలు అమలు చేస్తాయా లేదా అన్నది ఆయా రాష్ట్రాల చేతుల్లో ఉన్నది. అంతేకాదు...జరిమానాలు విషయంలో కూడా రాహ్ట్రాలకు స్వేచ్ఛ ఉందని.. జరిమానాలు తగ్గించుకోవచ్చని అన్నారు. నిన్న గుజరాత్ లో జరిమానాలను తగ్గించిన సంగతి తెలిసిందే. అంతేకాదు వాహన అమ్మకాల విషయంలో కూడా నితిన్ గడ్కారి స్పందించారు. ప్రజా రవాణా పెరిగిందని.. వాహనాల అమ్మకాలు తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చని అన్నారు.