నేడు హైదరాబాద్ కు గడ్కరీ

నేడు హైదరాబాద్ కు గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం హైదరాబాద్ కు వస్తున్నారు. బీజేపీ నేతలు సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో నిర్వహించే సమావేశానికి గడ్కరీ హాజరయి ప్రసంగిస్తారు. హైదరాబాద్,  సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ శక్తికేంద్ర ఇన్‌చార్జీలు, నేతలు ఈ సమావేశంను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, కిషన్‌రెడ్డిలు హాజరుకానున్నారు.