నితిన్ లవర్ డే గిఫ్ట్ అదిరింది... 

నితిన్ లవర్ డే గిఫ్ట్ అదిరింది... 

నితిన్ కొత్త సినిమా భీష్మ రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ప్రేమికుల రోజు సందర్భంగా ఈరోజు ఈ మూవీలోని ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. సింగల్ యాంతం పేరుతో ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో సాంగ్ లో నితిన్ చాలా క్యూట్ గా కనిపించారు.  సింగిల్ యాంతం పేరుతో రిలీజ్ చేసిన ఈ సింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.  సింగిల్ గా ఉండే వ్యక్తి మింగిల్ కావడానికి చేసే ప్రయత్నాలు ఈ సాంగ్ లో చూపించారు.  

జంట కోసం నితిన్ పడే కష్టాలను సాంగ్ సరదాగా చూపించారు.  ఈ సాంగ్ లో నితిన్ సూపర్ గా కనిపించారు.  చిన్న చిన్న పదాలతో అద్భుతమైన అర్ధాన్నిచ్చేలా సాంగ్ ను తెరకెక్కించారు.  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు వెంకీ కుడుములు దర్శకత్వం వహిస్తున్నారు.