సుకుమార్ తో నితిన్..

సుకుమార్ తో నితిన్..

ఒకవైపు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు యువదర్శకులకు అవకాశం ఇచ్చేందుకు నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన దర్శకుడు సుకుమార్.  సుకుమార్ రైటర్స్ బ్యానర్ అనే సంస్థను నెలకొల్పి.. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు.  ఇలా నిర్మించిన సినిమా కుమారి 21 ఎఫ్.  తరువాత మరో సినిమా చేశాడు.  రంగస్థలం బిజీ వలన కొన్నాళ్ళు సొంత బ్యానర్ కు దూరంగా ఉన్న సుకుమార్ ఇప్పుడు తిరిగి సొంత బ్యానర్లో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు.  

సుకుమార్ సొంతబ్యానర్, గీతా ఆర్ట్స్ కు చెందిన జీఏ2 బ్యానర్ తో కలిసి సంయుక్తంగా సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.  ఈ సినిమాకు సుకుమార్ కథ, కథనాలు అందిస్తుంటే.. సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.  కుమారి 21 ఎఫ్ హిట్ కావడంతో ఆ దర్శకుడికే మరో అవకాశం ఇచ్చాడు.  ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు.  దాదాపుగా అన్ని సెట్ అయ్యాయి.. సెట్స్ మీదకు వెళ్లడమే మిగిలి ఉన్నది.  ఈ సినిమాతోనైనా నితిన్ హిట్ కొడతాడేమో చూడాలి.