డిసెంబర్ వరకు చూద్దాం ఆతర్వాత ఓటీటీ గురించి ఆలోచిద్దాం ..!

డిసెంబర్ వరకు చూద్దాం ఆతర్వాత ఓటీటీ గురించి ఆలోచిద్దాం ..!

కరోనా వైరస్ తో ప్రపంచం చిగురుటాకులా వణుకుతుంది. ఇప్పటికే అన్ని దేశాల్లో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మనదేశంలో ఈ మహమ్మారి రోజు రోజుకు పెరుగుతుండగా ప్రజలంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇక కరోనా అన్ని రంగాలపై తీవ్రప్రభావం చూపింది. సినిమా ఇండస్ట్రీపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. అన్ని సినిమా షూటింగ్ లు, రిలీజ్ లు వాయిదా పడ్డాయి . ఇక ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడంలేదు దాంతో షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలు , షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు చేసేదేమి లేక డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల నాని నటించిన వి సినిమా కూడా ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ నేపథ్యంలో యంగ్ నితిన్ నటిస్తున్న రంగ్ దే సినిమా కూడా ఓటీటీ ద్వారా విడుదల అవుతుందని వార్తలు షికారు చేసాయి. కాని హీరో నితిన్ మాత్రం ఇంకా ఓటీటీ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆయన చేస్తున్న 'రంగ్ దే' సినిమాను ఓటీటీ లో విడుదల చేసే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే సమయంలో ప్రముఖ ఓటీటీ ల నుండి ఈ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తున్నాయట.వచ్చే నెల నుండి థియేటర్లు ఓపెన్ అయితే నవంబర్ లేదా డిసెంబర్ లో సినిమాను థియేటర్లలోనే విడుదల చేద్దాం లేదంటే అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిద్దాం అని చిత్రయూనిట్ భావిస్తోందట.