బీహార్ ఎన్డీయే కెప్టెన్ ఆయనే..!!! 

బీహార్ ఎన్డీయే కెప్టెన్ ఆయనే..!!! 

2020లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.  ఆ ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ, బీజేపీ కలిసి ఆ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి.  గత పార్లమెంట్ ఎన్నికల తరువాత కేంద్రమంత్రి వర్గంలో మూడు మంత్రి పదవులు కావాలని నితీష్ కుమార్ కోరారు.  కానీ, కేంద్రం మాత్రం ఒక్కటే ఇస్తామని చెప్పడంతో.. నితీష్ కుమార్ అలిగారు.  తమకు ఆ ఒక్క మంత్రి పదవి కూడా వద్దని చెప్పారు నితీష్ కుమార్. పార్లమెంట్ ఎన్నికలు వేరు, రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు వేరని, రాష్ట్రంలో నితీష్ కుమార్ జెడియు, బీజేపీలు కలిసి పనిచేస్తాయని గతంలోనే నితీష్ కుమార్ పేర్కొన్నారు.  

అయితే, 2020లో జరిగే బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిని మారుస్తారని వార్తలు వచ్చాయి.  నితీష్ కుమార్ తప్పుకొని ఆ స్థానాన్ని సుశీల్ మోడీకి ఇవ్వాలని బీజేపీ నేత డిమాండ్ చేశారు.  దీనిపై సుశీల్ మోడీ స్పందించారు.  వచ్చే బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కెప్టెన్ గా నితీష్ కుమార్ ఉంటారని.. ఆయన్ను మార్చే అవకాశం లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఎన్డీయే బీహార్లో విజయం సాధిస్తుందని చెప్పారు.