ఘనంగా నితిష్ రాణా ‌నిశ్చితార్థం‌...

ఘనంగా నితిష్ రాణా ‌నిశ్చితార్థం‌...

ఐపీఎల్‌-11లో బిజీగా గడిపిన భారత ఆటగాళ్లందరూ ఒక్కొక్కరుగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. గత సంవత్సరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పెళ్లితో మొదలైన సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ లిస్టులో ఐపీఎల్‌-11లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్యాట్స్ మెన్ నితిశ్‌ రాణా కూడా చేరిపోయాడు. ఆదివారం ఢిల్లీలో నితిశ్ రాణాకు తన చిన్ననాటి స్నేహితురాలు సాచి మర్వాతో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు తన సన్నిహితులతో పాటు కుటుంబ సభ్యులు మాత్రమే  హాజరయ్యారు. రాణా క్లోజ్ ఫ్రెండ్, సహ ఆటగాడు దృవ్‌ శర్మ ఈ వేడుకకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌ ప్రాంచైజీ కేకేఆర్ తన అధికారిక ట్విటర్ ద్వారా ఈ  నిశ్చితార్థంకు సంబందించిన ఫొటోను షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. అయితే రాణా-సాచిల వివాహ తేదీ ఇంకా ఖరారుకాలేదు.

ఐపీఎల్‌-11 సీజన్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన నితీష్ రాణా 15 మ్యాచ్‌ల్లో 304 పరుగులతో పాటు 4 వికెట్లను తీసాడు. కొద్దీ రోజుల క్రితం మయాంక్‌ అగర్వాల్‌ కూడా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక రెండు రోజుల క్రితం ఐపీఎల్‌-11లో సన్‌రైజర్స్‌ జట్టుకు ఆడిన సందీప్‌ శర్మ కూడా తన స్నేహితురాలిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు.