ఆర్ఆర్ఆర్ సినిమాలో బన్నీ హీరోయిన్

ఆర్ఆర్ఆర్ సినిమాలో బన్నీ హీరోయిన్

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  రామ్ చరణ్ కు గాయం కారణంగా సినిమా షూటింగ్ మూడు వారాల పాటు వాయిదా పడింది.  మరోవైపు బ్రిటిష్ నటి డైసీ సినిమా నుంచి తప్పుకోవడంతో మరో హీరోయిన్ కోసం రాజమౌళి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.  బ్రిటిష్ హీరోయిన్ల పేర్లు, బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు.  

తాజా సమాచారం ప్రకారం, సౌత్ లో అనేక హిట్ సినిమాల్లో నటించిన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ కు ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి పిలుపు వచ్చిందని, రీసెంట్ గా స్క్రీన్ టెస్ట్ కూడా హాజరైందని సమాచారం.  అయితే, ఎన్టీఆర్ కు జోడిగా నిత్యామీనన్ ను తీసుకుంటారా లేదంటే మరో కీలక పాత్ర కోసం తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.