మెల్లగా దూసుకొస్తున్న హీరోయిన్

మెల్లగా దూసుకొస్తున్న హీరోయిన్

ఈమధ్య తెలుగు సినీ పరిశ్రమపై ఇతర భాష పరిశ్రమల హీరోయిన్లకు ఆసక్తి ఎక్కువైంది.  ఇక్కడి సినిమాల్లో నటించడం కోసం వరుసగా క్యూ కడుతున్నారు.  అలంటి హీరోయిన్లాలో నివేత పేతురాజ్ కూడా ఒకరు.  'మెంటల్ మదిలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తరవాత 'చిత్రలహరి, బ్రోచేవారెవరురా' సినిమాల్లో నటించి మెప్పించింది. 

అంతేకాదు ప్రజెంట్ ఆమె చేతిలో మూడు పెద్ద సినిమాలున్నాయి.  వాటిలో రెండు అల్లు అర్జున్ సినిమాలే కావడం విశేషం.  త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న ఆమె వేణు శ్రీరామ్ డైరెక్షన్లో బన్నీ చేయనున్న 'ఐకాన్' చిత్రంలో కూడా అవకాశాన్ని దక్కించుకుందని టాక్.  ఈ రెండూ కాకుండా రామ్, కిశోర్ తిరుమల కొత్త చిత్రంలో కూడా ఆమె ప్రధాన కథానాయకిగా కుదిరిందట.  మొత్తానికి ఈ చెన్నై భామ నిశ్శబ్దంగా తెలుగు పరిశ్రమలోకి దూసుకొస్తోంది.