అల్లు అర్జున్ సినిమాలో నటించట్లేదు

అల్లు అర్జున్ సినిమాలో నటించట్లేదు

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా ముగిసింది.  అయితే ఈ చిత్రంలో సిస్టర్ సెంటిమెంట్ కోణం ఎక్కువగా ఉంటుందని, బన్నీ చెలెల్లిగా నివేతా థామస్ నటించనుందని వార్తలొచ్చాయి.  దాదాపు ఈ వార్త నిజమని నమ్మేశారంతా .  కానీ ఈ వార్త గురించి విన నివేత మాత్రం అందులో నిజం లేదని అంటోంది.  సినిమా విషయమై ఎవరూ తనను సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చేసింది.   హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.