తెలుగులో సినిమాలు తగ్గిపోడానికి నివేత ఏం చెప్పిందో తెలుసా?

తెలుగులో సినిమాలు తగ్గిపోడానికి నివేత ఏం చెప్పిందో తెలుసా?

నివేత థామస్ తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకుంది.  జెంటిల్ మెన్, నినుకోరి, జైలవకుశ సినిమాలతో స్టార్ గా ఎదిగిన నివేత, 118 సినిమాలో కళ్యాణ్ రామ్ తో కలిసి నటించింది.  కాగా, ఇప్పుడు బ్రోచేవారెవరురా అంటోంది.  

ఈ సినిమా జూన్ 28 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  తెలుగులో తక్కువ సినిమాలు చేయడానికి షూటింగ్ ఆలస్యమే కారణం అంటోంది.  తమిళ, మలయాళం సినిమాల్లో బిజీగా ఉన్న నివేత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.  అలాంటి పాత్రలకు ఆమె దూరమో లేదంటే.. ఆలాంటి పాత్రలు ఆమెకు రావడంలేదు ఆమెనే చెప్పాలి.  రజినీకాంత్ దర్బార్ సినిమాలో కీలక రోల్ చేస్తున్నట్టు సమాచారం.