స్ట్రాంగ్ రూమ్ కి నేనూ తాళం వేస్తా

స్ట్రాంగ్ రూమ్ కి నేనూ తాళం వేస్తా

రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ దేవుళ్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మూడంచెల భద్రతతో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి. అయితే ఇటీవల టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌లో దిగిన ఫోటో కాస్త వైరల్ కావడంతో ఈవీఎంల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో నిజామాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఓ వింత వినతితో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తాను పోటీచేసిన నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు ఉంచిన గదికి తనను తాళాలు వేసుకోనివ్వాలని కోరారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర ఉన్న భద్రతపై తనకు నమ్మకం లేనందువల్ల తనను తాళాలు వేసుకొనేందుకు అనుమతించాలని కోరుతూ అరవింద్ ఈసీకి లేఖ రాశారు.