ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మాట ఒక్కటే.. కేటీఆర్‌ సీఎం కావాలి..!

ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మాట ఒక్కటే.. కేటీఆర్‌ సీఎం కావాలి..!

కేటీఆర్‌ను సీఎంను చేయాలనే డిమాండ్‌ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది.. ఈ మధ్య కేటీఆర్‌ పట్టాభిషేకానికి ముహూర్తం కూడా పెట్టేశారనే వార్తలు హల్‌చల్ చేచస్తున్నాయి... మరి గులాబీ బాస్‌ మదిలో ఏముందో తెలియదు కానీ.. సీనియర్ మంత్రులు సైతం.. కేటీఆర్‌కు జై కొడుతున్నారు.. ఇక, ఎమ్మెల్యేల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.. సందర్భం వచ్చినప్పుడల్లా.. కేటీఆరే సీఎం కావాలంటూ తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. తాజాగా, నిజాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకటే మాట మాట్లాడుతున్నారు.. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్‌.. ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్ధుడని చెబుతున్నారు. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని.. వచ్చే అసెంబ్లీ సమావేశాలు  కేటీఆర్ అధ్యక్షతన జరగాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే షకీల్.. యువ నేత కేటీఆర్ ను సీఎం చేయాలని కోరిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్.. కేటీఆర్ కు సీఎం అయ్యేలా ఆశీర్వాదం ఇవ్వాలన్నారు. నా తో పాటు చాలా మంది యువ ఎమ్మెల్యేల అభిప్రాయం ఇదేనన్నారు. ఇక, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్న వారిలో తాను ఒకడిని అన్నారు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి.. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆలోచించి.. కేటీఆర్ ను సీఎంను చేయాలని విజ్ఞప్తి చేశారు.