కేసీఆర్ కు 16 సీట్లు ఇస్తే దేశంలో కీలక పాత్ర 

కేసీఆర్ కు 16 సీట్లు ఇస్తే దేశంలో కీలక పాత్ర 

బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్లు సీఎం కేసీఆర్‌కు ఎంతో తృప్తినిచ్చే అంశమని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం సిరికొండలో ఎంపీ కవిత రోడ్‌షోలో మాట్లాడుతూ.. 20 కోట్లతో సిరికొండ మండలంలో సాగు నీటి కార్యక్రమం చేపట్టాం. గిరిజనులకు హక్కుగా వారి భూమి వారికి ఇప్పించే విధంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. ఇండ్లు లేని పేదలకు స్థలాలు ఉంటే వారికి రూ.5 లక్షలు కట్టుకునే వారికి ఇస్తాం. గజం భూమిలేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రతి ఊర్లో కట్టిస్తాం. ఢిల్లీలో ఎవరు ఉండాలన్న దానిపై ఎన్నికలు జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు అయ్యింది.. కానీ అభివృద్ధి చెందటం లేదు. గొప్ప వారు ప్రధానులయ్యారు కానీ దేశం బాగుపడట్లేదు. ఈ సారి కేసీఆర్ కు 16 సీట్లు ఇస్తే దేశంలో కీలక పాత్ర పోషిస్తారు. దేశంలో ఉన్న ఆడబిడ్డలు ఆనందంగా ఉండాలి, ఇక్కడి బీడీ కార్మికుల్లాగే 13 రాష్ట్రాల్లో ఫించన్ ఇవ్వాలి. దయతో 16 గెలిపిస్తే ఢిల్లీలో కేసీఆర్ 116 సీట్లు కూడగట్టే తెలివి ఉంది. కాంగ్రెస్ ది మొత్తం కుంభకోణాల చరిత్రే. బీజేపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోంది. గుజరాత్‌లో ఇచ్చే వృద్ధాప్య పెన్షన్‌ రూ.750 మాత్రమే. ఐదేళ్ల నుంచి పెన్షన్‌ ఇస్తున్నాం.. ఎన్నికల ముందు కాదు. అని కవిత పేర్కొన్నారు. ఈ రోడ్‌షోలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.