బోగస్ ఓట్లను తొలగించాలంటూ బీజేపీ ఫిర్యాదు

బోగస్ ఓట్లను తొలగించాలంటూ బీజేపీ ఫిర్యాదు

నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని బోగస్ ఓట్లను తొలగించాలంటూ బీజేపీ ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. అనంతరం బీజేపీ నాయకులు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, బోగస్ ఓట్లతోనే టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో లక్ష 25వేల బోగస్ ఓట్లు ఉన్నాయని తెలిపారు. అధికార టీఅర్ఎస్ పార్టీ కి కొంతమంది అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బోగస్ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మైనార్టీ ప్రాంతాల్లోని బోగస్ ఓట్లను తొలగించాలి, వీటికి సంబంధించిన ఆధారాలను అధికారులకు అందచేశామని అన్నారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు.