కాలాకు కళ తగ్గిందా..?

కాలాకు కళ తగ్గిందా..?

కాలా సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.  ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.  సాధారణంగా తమిళనాడులో రజినీకాంత్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి.  మొదటిరోజు సినిమా థియేటర్స్ వద్ద హంగామా కనిపిస్తుంది. అయితే, కొన్ని థియేటర్స్ లో టికెట్స్ అమ్మకాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయట.  చెన్నైలోని కాశీ థియేటర్స్ లో వీకెండ్ బుకింగ్స్ ఇంకా జరుగుతున్నట్టు తెలుస్తోంది.  రజినీకాంత్ సినిమా అంటే మొదటి రోజు నుంచే ఆ థియేటర్ వద్ద హంగామా ఉంటుంది.  కానీ, కాలా సినిమాకు అక్కడ హడావుడి కనిపించడంలేదు.  సత్యం మల్టిప్లెక్స్ వద్ద కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.  

స్టెరిలైట్ వివాదం విషయంలో రజినీకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సినిమాపై ప్రభావం చూపించాయని కొందరు అంటున్నారు.  అలాగే, కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాల విషయంలో జరుగుతున్న రగడ కూడా రజినీకాంత్ సినిమాపై ప్రభావం చూపింది.  కర్ణాటకలో భారీ ఎత్తున రిలీజ్ అయ్యే రజినీకాంత్ సినిమాలు కాలా విషయంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది.  కర్ణాటక హైకోర్ట్ కాలాలకు అనుకూలంగానే తీర్పు ఇచ్చినప్పటికీ.. ప్రేక్షకులు ఎంతమంది థియేటర్స్ కు వస్తారు అనేది తెలియాలి.  ఇక పా రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి సినిమా ఇండియాలో 4000 స్క్రీన్స్ లో రిలీజైతే.. కాలా కేవలం 2500 స్క్రీన్స్ లో రిలీజయింది.  ఇది కాలా ఓపెనింగ్స్ కు పెద్ద మైనస్.