బయోపిక్ ఉండదని నాగార్జున చెప్పేశాడుగా !

బయోపిక్ ఉండదని నాగార్జున చెప్పేశాడుగా !

బాలక్రిష్ణ చేసిన 'ఎన్టీఆర్' బయోపిక్ 9న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.  ఆ సినిమాతో నందమూరి అభిమానులంతా  ఖుషీ అయిపోయారు.  తమ అభిమాన కథానాయకుడి కథను వెండి తెరపై చూసుకుని మురిసిపోయారు.  ఇక ఎన్టీఆర్ పాత్రను బాలయ్యే స్వయంగా చేయడం వారికి మరొక బోనస్.  వారి సంతోషాన్ని చూసిన అక్కినేని అభిమానుల్లో సైతం ఏఎన్నార్ జీవితాన్ని కూడ సినిమాగా చూడాలనే కోరిక పుట్టుకొచ్చింది.  ఎవర్ని కదిలించిన తీస్తే బాగానే ఉంటుంది కదా అంటున్నారు. 

కానీ నాగార్జునలో మాత్రం ఆ ఆలోచన లేదు.  గతంలో ఈ విషయంపై స్పందించిన అయన ఒక జీవితాన్ని సినిమాగా చేయాలంటే అందులో ఎత్తు పల్లాలు ఉండాలి.. కానీ నాన్నగారి జీవితం మొత్తం సాఫీగా సాగిపోయిందని అన్నారు.  కాబట్టి దాన్ని సినిమాగా తీస్తే సినిమాలా ఉండదని వివరణ ఇచ్చారు.  తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ బయోపిక్ అనగానే నవ్వుతూ మౌనం వహించారు.  దీన్నిబట్టి ఒకవేళ నాగ్ మనసు మార్చుకున్నా బయోపిక్ రూపొందడానికి ఇంకా టైమ్ పడుతుందని అర్థమవుతోంది.