ఫెడ్‌ వడ్డీ రేట్లలో మార్పు లేదు

 ఫెడ్‌ వడ్డీ రేట్లలో మార్పు లేదు

దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతోందని హెచ్చరిస్తూనే... అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లలో మార్పు చేయరాదని నిర్ణయించింది. ఆహారం, ఇంధనం మినహా ఇతర రంగాల్లో ద్రవ్యోల్బణం రెండు శాతానికి చేరిందిన ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది. ఫెడ్‌ నిర్ణయం తరవాత అమెరికా మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి. డౌజోన్స్ 30, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు 0.7శాతం క్షీణించగా, నాస్‌డాక్‌ అరశాతం తగ్గింది. ఫెడ్‌ నిర్ణయం తరవాత ఫ్యూచర్స్ లాభల్లోకి వచ్చాయి. మరోవైపు ఫెడ్‌ నిర్ణయం కారణంగా డాలర్‌ ఇండెక్స్‌ క్షీణించింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి.