వరల్డ్ కప్‌లో భారత్‌-పాక్‌.. ఐసీసీ బాస్‌ ఏమన్నారంటే..

వరల్డ్ కప్‌లో భారత్‌-పాక్‌.. ఐసీసీ బాస్‌ ఏమన్నారంటే..

మే 5 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో జూన్ 16న జరగబోయే టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. పుల్వామాలో 40మందికి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉగ్రదాడిలో అసువులు బాసిన నేపథ్యంలో పాక్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. 

ఐతే.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌సహా ఐసీసీ వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులూ లేవని ఐసీసీ సీఈవో డేవ్‌ రిచర్డ్‌సన్‌ చెప్పారు. అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని డేవ్‌ రిచర్డ్‌సన్‌ చెప్పారు. 

ఇదే విషయంపై హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. దేశం అన్నింటి కంటే ప్రథమమని.. క్రికెట్, హాకీ, ఇతర ఏ క్రీడ అయినా దేశం తర్వాతేనని స్పష్టం చేశాడు. పాక్ కుట్రపూరితంగా భారత సైనికులను చంపుతున్న ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌ను పక్కనపెట్టడమే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.