'మహర్షి' డెసిషన్ మారదు !
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమా 'మహర్షి' షూటింగ్ చివరి దశలో ఉంది. మార్చి నాటికల్లా చిత్రీకరణ ముగుస్తుంది. ముందుగా చెప్పినట్టే సినిమా 25 ఏప్రిల్ విడుదలకానుంది. ఈ తేదీని ఇంతకుముందే ప్రకటించినా వాయిదా పడుతుందనే రూమర్లు రావడంతో దిల్ రాజు మరోసారి క్లారిటీ ఇస్తూ తేదీలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినీదత్, పివిపిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అభిమానులకు కావాల్సిన అన్ని విశేషాలతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుందట.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)