నేటి ఇంధన ధరల్లో మార్పు లేదు

నేటి ఇంధన ధరల్లో మార్పు లేదు

గురువారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. బుధవారం నాటి ధరలే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గినా.. దేశీయంగా ఇంధన ధరలు ఇటీవల పెరుగుతూనే వచ్చాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 60.79 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 52.31 డాలర్ల వద్ద ఉంది.

గురువారం ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.71.27.. డీజిల్ ధర రూ.65.90 వద్ద నిన్నటి ధరలతో కొనసాగుతున్నాయి. ముంబయిలో పెట్రోలు ధర రూ.76.90 .. డీజిల్ ధర రూ.69.01లుగా ఉంది. హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.75.61లుగా.. డీజిల్ ధర రూ.71.64 వద్ద కొనసాగుతోంది. ఇక అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.75.38 వద్ద, డీజిల్‌ ధర రూ.71.03 వద్ద ఉన్నాయి.