పిల్లలు లేరా ... అయితే టాక్స్ కట్టండి

పిల్లలు లేరా ... అయితే టాక్స్ కట్టండి

ఒకప్పుడు జనాభాను కట్టడి చేసేందుకు పలురకాల చట్టాలు చేసిన చైనా... ఇప్పుడు పిల్లలు కనండి అంటూ యువతకు సూచనలు చేస్తోంది. చైనాలో వృద్ధులు సంఖ్య నానాటికి పెరిగి పోతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా ఇద్దరు విద్యావేత్తలు వివాదాస్పదమైన ఐడియాను ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పిల్లల్ని కనకపోతే టాక్స్ వేయాలనేది దీని సారాంశం. ఇప్పుడు ఆ దేశంలో ఈ ప్రతిపాదన కలకలం రేపుతోంది. దీనిపై సోషియల్ మీడియాలో కూడా తీవ్రంగా చర్చ జరుగుతోంది. కమ్యునిష్టు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనాభాను అరికట్టేందుకు పలు రకాల ఫ్యామిలీ ప్లానింగ్ విధానాలను దేశంలో అమలు చేశారు. ఒకరే ఇంటికి ముద్దు, ఇద్దరు వద్దు అనే నినాదం పలు దశాబ్ధాలు అమల్లో ఉండేది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనా... ఇప్పుడు వృద్ధులతో నిండిపోయింది. దీంతో యువత పూర్తిగా తగ్గిపోయింది. దీంతో వృత్తి పరంగా కూడా నాణ్యత తగ్గిపోయింది. ఆర్థికంగా వెనుకబడిపోతామనే ఆందోళన ఆ దేశాన్ని కలవర పరుస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల్ని కనండి లేదా మెటర్నిటీ ఫండ్ కట్టండి అనే ప్రతిపాదన వస్తోంది. ప్రస్తుతం చైనా జనాభా 1,382 మి.