పూరి, రామ్ మధ్య గొడవలు.. అసలు మ్యాటర్

పూరి, రామ్ మధ్య గొడవలు.. అసలు మ్యాటర్

'ఇస్మార్ట్ శంకర్' విడుదల ఇంకొన్ని రోజులు మాత్రమే ఉందనగా హీరో రామ్ ప్రమోషన్స్ కూడా చేయకుండా హాలీడే నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోయాడు.  ఇలా హీరో రిలీజ్ పెట్టుకుని కూడా హాలీడే అంటూ వెళ్లిపోవడంతో పుకార్లు ఊపందుకున్నాయి.  రామ్, పూరికి మధ్యలో మనస్పర్థలు వచ్చాయని, అందుకే రామ్ వెళ్లిపోయాడనే ప్రచారం జరిగింది. 

కానీ అసలు విషయం అది కాదట.  రామ్ తన హాలీడేను కొన్ని నెలల ముందే ప్లాన్ చేసుకున్నాడట.  అది కూడా కుటుంబంతో.  అందుకే దాన్ని క్యాన్సిల్ చేసుకోలేక పూరి మీద నమ్మకముంచి ప్రచార బాధ్యతల్ని పూరికి అప్పగించి హలీడేకు వెళ్ళిపోయాడట.  అంతేకానీ వారి మధ్య మనస్పర్థలు లేవట.  ఇకపోతే గత వారం విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లతో విజయం దిశగా దూసుకుపోతోంది.