విజయశాంతి వ్యాఖ్యలపై నో కామెంట్..!

విజయశాంతి వ్యాఖ్యలపై నో కామెంట్..!

తనపై విజయశాంతి చేసిన వ్యాఖ్యలపై నో కామెంట్ అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి... "కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వస్తే చంద్రబాబు, జగన్ తో పాటు కేసీఆర్ కూడా కూటమిలో చేరుతారని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన విజయశాంతి.. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తాయని.. 'ఓవైపు స్ధానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావో, రేవో తేల్చుకునే విధంగా పోరాడుతున్నాం. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడబోయే యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ కూడా చేరబోతోందని చెబితే, స్ధానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కు మేలు జరుగుతుందని ఆమె మండిపడ్డ సంగతి తెలిసిందే. అయితే విజయశాంతి వ్యాఖ్యలపై నో కామెంట్ అంటూనే కీలక కామెంట్లు చేశారు జగ్గారెడ్డి... మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. విజయశాంతి.. పార్టీ కోసం గట్టిగా పనిచేస్తే.. కాంగ్రెస్ కి మంచి అసర్ట్ అన్నారు. బహుశా పీసీసీ పదవి కావాలని విజయశాంతి కోరుకుంటున్నట్టున్నారని హాట్‌ కామెంట్లు చేసిన జగ్గారెడ్డి.. సౌత్ స్టార్ క్యాంపెయినర్‌ చేసినా పార్టీకి లాభమే అన్నారు. అయితే, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువన్న ఆయన.. చాలా మందికి సీఎం కావాలని కోరిక ఉందన్నారు. ముఖ్యమంత్రి పదవి ఆశించకుండా... సొంత ఖర్చులతో పార్టీని నడిపించే వారు ముందుకు వస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. 

ఇక ఎవరు ముఖ్యమంత్రి అయినా పరవాలేదు.. కానీ,  అందరిని కలుపుకుని పనిచేసే నాయకుడు ఇప్పుడు పార్టీకి అవసరం అన్నారు జగ్గారెడ్డి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పార్టీ కోసం ఖర్చు చేశారు కాబట్టే ఆయనకు  అప్పులయ్యాయన్న జగ్గారెడ్డి.. ఆర్థికంగా తట్టుకోవాలి.. పదవి ఆశించకుండా పనిచేసేవారు పీసీసీ చీఫ్‌ అయితే  పార్టీకి లాభం అన్నారు. విజయశాంతి వల్ల పార్టీకే లాభం.. పార్టీతో ఆమెకి కూడా లాభమన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఫుల్ టైం ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తే... మంచి ఆదరణ ఉంటుందన్నారు. పార్టీ ప్రక్షాళనపై నా అభిప్రాయాలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాస్తానన్న ఆయన.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా.. తాను సీఎం కావాలని ఎక్కడ పని చేయలేదని.. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పనిచేశారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు బాధ్యత పీసీసీది కాదన్న జగ్గారెడ్డి... ఎమ్మెల్యేలు స్వలాభం కోసం పార్టీ మారని మండిపడ్డారు. పార్టీ మారిన వాళ్లంతా.. బలహీనతలతోనే వెళ్లారన్న ఆయన.. కొద్ది మంది నాయకులు... కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారని చర్చ జరుగుతోందని హాట్ కామెంట్లు చేశారు. అయితే, దానిపై సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతానన్నారు జగ్గారెడ్డి.