సైరా క్లైమాక్స్ ఇలానే ఉంటుందా?

సైరా క్లైమాక్స్ ఇలానే ఉంటుందా?

మెగాస్టార్ సైరా సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు స్పీడ్ గా జరుగుతున్నాయి.  ఈనెల 18 వ తేదీన సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నది.  ఈ ఈవెంట్ కోసం ఎల్బీ స్టేడియంను రెడీ చేస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ తో పాటు రాజమౌళి కూడా హాజరవుతుండటం విశేషం.  ఈ మూవీపై భారీ నమ్మకాలు ఉన్నాయి.  

ఇదిలా ఉంటె, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా విషయానికి వస్తే..దేశం కోసం పోరాటం చేసిన నరసిమహారెడ్డి.. చివరకు బ్రిటిష్ వాళ్ళ చేతిలో చిక్కి బలి అవుతాడు.  అయితే, సైరా క్లైమాక్స్ ను నెగెటివ్ గా కాకుండా పాజిటివ్ గా ఎమోషన్స్ తో ఎండ్ చేస్తున్నారట.  మెగాస్టార్ బ్రిటిష్ సైనికుల చేతికి చిక్కడంతో ఎండ్ చేస్తారో లేదంటే మరెలా ఎండ్ చేస్తారో చూడాలి.  క్లైమాక్స్ లో విషాదం లేకుండా ఎమోషన్స్ తో క్లోజ్ చేస్తున్నారని మాత్రం సమాచారం.  సినిమా ఎలా ఉన్నది అనే విషయం తెలియాలంటే అక్టోబర్ 2 వ తేదీ వరకు ఆగాల్సిందే.