నాగేశ్వరరావు నియామకంపై చర్చే జరగలేదట!!!

నాగేశ్వరరావు నియామకంపై చర్చే జరగలేదట!!!

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా ఎం. నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణలో ప్రభుత్వం కోర్టుని తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్. జనవరి 11న జరిగిన హైపవర్డ్ కమిటీ సమావేశంలో నాగేశ్వరరావుని తాత్కాలిక డైరెక్టర్ గా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం కోర్టుకు చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆలోక్ వర్మను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నపుడు లోక్ సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చెబుతున్న మాటలకు, ప్రభుత్వ ప్రకటనలకు పొంతనే లేదని ఆయన ఆరోపించారు. నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా తిరిగి నియమించినపుడు జరిగిన హైపవర్డ్ కమిటీ సమావేశంలో నాగేశ్వరరావు నియామకంపై చర్చ జరగలేదని, అసలు ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రతిపక్ష నేత ఖర్గే తనకు స్పష్టంగా చెప్పినట్టు ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. హైపవర్డ్ కమిటీ సమావేశానికి సంబంధించి కల్పిత మినిట్స్ ని కోర్టుకు సమర్పించారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.