ఆలోక్ వర్మకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవు

ఆలోక్ వర్మకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవు

మాజీ సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలు లభించలేదని సీవీసీ విచారణ జరుపుతున్న రిటైర్డ్ జడ్జి పట్నాయక్ తెలిపారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానా ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ మొత్తంలో ఆలోక్ వర్మకు వ్యతిరేకంగా ఏ ఒక్క సాక్ష్యం లభించలేదని అన్నారు. ఇదే విషయాన్ని తన రిపోర్టు పేర్కొన్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిటైర్డ్ జడ్జి పట్నాయక్ స్పష్టం చేశారు.