ఫెడరల్ ఫ్రంట్ అనేది పగటి కలే...

ఫెడరల్ ఫ్రంట్ అనేది పగటి కలే...

ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పగటి కలే అని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని రేసులో లేనంటూ ఏపీ సీఎం చంద్రబాబు ముందు నుంచే స్పష్టం చేస్తున్నారని తెలిపారు. యూపీఏ కూటమిలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ నెల 16న కడప జిల్లాలో పర్యటిస్తారని, ఆ రోజు కేంద్ర మాజీ మంత్రి  సాయిప్రతాప్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారని తులసిరెడ్డి వెల్లడించారు.