ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత లేదు..

ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత లేదు..

ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత లేదని తెలంగాణ ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కే. రామకృష్ణారావు తెలిపారు. స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానా సంక్షోభంలో ఉందంటూ ప్రచురితమైన వార్తలపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు వేతనాలు, ఆసరా పెన్షన్లు, ప్రాజెక్టుల బిల్లులు, సంక్షేమ పథకాలకు నిధులను సకాలంలోనే చెల్లిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతేడాది అధిక ఆర్థిక వృద్ధి నమోదైందన్నారు. ఆర్థిక వృద్ధిరేటు నమోదులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. స్టేట్‌ ఓన్‌ ట్యాక్స్‌లోనూ తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. రాష్ట్రం వృద్ధిరేటు 14శాతం కంటే తక్కువ ఉంటే.. కేంద్రం జీఎస్టీ మినహాయింపు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు కేవలం రూ.3,474కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు.

'కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,474 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 2018-19 రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.8 లక్షల 65వేల 875 కోట్లు. ఆర్థిక వృద్ధి రేటు 15శాతంగా ఉంది. ఐదేళ్లలో రాష్ట్ర కాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ లక్షా 64వేల 519 కోట్లు. మిషన్ భగీరథ ప్రాజెక్టుపై రూ.27,509 కోట్లు ఖర్చు చేశాం, రూ.659 కోట్లు బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. రైతుబంధు కోసం రబీ సీజన్‌లో రూ.5200 కోట్లు విడుదల చేశాం. పెట్టుబడి పెరుగుతున్న కొద్దీ ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుంది. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి. నెలాఖరు నుంచి జూన్ మొదటి వారం వరకు రైతుబంధు సాయం పంపిణీ చేయనున్నాం. రైతుబంధు పథకం నిధులు రైతులకు ఆన్‌లైన్‌లో చెల్లిస్తాం అని రామకృష్ణారావు తెలిపారు.