ఇళ్ళ యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేయకూడదు..కానీ !

ఇళ్ళ యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేయకూడదు..కానీ !

 

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 979కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 106 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం 867 కరోనా యాక్టివ్ కేసులుండగా, మహారాష్ట్రలో అత్యధికంగా 196కు పాజిటీవ్‌ కేసులున్నాయని వివరించింది. కరోనా వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు భారత్‌లో 25 మంది చనిపోయినట్టు తెలిపింది.  కాగా, లాక్‌డౌన్‌ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. వలస కూలీల ప్రయాణాలు ఆపేయాలంటూ ఆదేశించింది. అలాగే, రాష్ట్రాలు, జిల్లాల మధ్య ప్రయాణాల్ని కూడా  నిలిపివేయాల్సిందిగా స్పష్టం చేసింది కేంద్రం. ఇక వలస కూలీలకు ఆహారం, వసతి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రాలకు అప్పగించింది కేంద్రం. ఇంటి యజమానులు కూడా అద్దె చెల్లించాలని వలస కూలీలపై ఒత్తిడి చేయకూడదని స్పష్టం చేసింది. కాగా, దేశంలో నిత్యావసరాల కొరత లేదని తెలిపింది. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వాళ్లలో గల తాత్కాలిక వైద్య సిబ్బందికి సైతం 50 కోట్ల రూపాయల హెల్త్ ఇన్స్యూరెన్స్ కల్పిస్తున్నట్టు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.