మా సంస్థలపై ఐటీ దాడుల్లేవ్‌...

మా సంస్థలపై ఐటీ దాడుల్లేవ్‌...

తమ సంస్థ లేదా నివాసాలపై ఇప్పటి వరకు ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని నారాయణ విద్యా సంస్థలు ప్రకటించాయి. మంత్రి నారాయణకు చెందిన నివాసాలు, విద్యా సంస్థలపై ఏకకాలంలో దాడులు జరుగుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించి ఈ వివరణ ఇస్తున్నట్లు నారాయణ విద్యా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, మరోవైపు ఏపీలోని కొందరు నేతలను టార్గెట్‌గా ఐటీ దాడులు జరుగుతాయనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే విజయవాడ, గుంటూరు... తదితర ప్రాంతాల నుంచి ఐటీ బృందాలు సోదాలకు బయల్దేరాయి.