మహాకూటమి లేదు -ఒంటరిగానే బరిలోకి

మహాకూటమి లేదు -ఒంటరిగానే బరిలోకి

ఢిల్లీలో మహాకూటమికి కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసేసింది. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఢిల్లీలో మహాకూటమికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించటం లేదని వెల్లడించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు బీజేపేతర పార్టీలు ఏకం కావాలని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. అయితే.. కాంగ్రెస్ ఇందుకోసం చేతులు కలపాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. వారిని కట్టడి చేసేందుకు తాము ఏమి చేయటానికి సిద్ధమని వెల్లడించారు. అయితే.. కాంగ్రెస్ ఢిల్లీలో జట్టు కట్టేందుకు తిరస్కరిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం తలుపులు ముసుకున్నాయనీ, తాము ఒంటిరిగానే బరిలోకి దిగుతామని వెల్లడించారు.