వలస కూలీలపై విచారణ.. సుప్రీం కీలక ఆదేశాలు

వలస కూలీలపై విచారణ.. సుప్రీం కీలక ఆదేశాలు

కరోనా వైరస్ విస్తరణ ఆ తర్వాత లాక్ డౌన్ తో వలస కూలీల కష్టాలు అంతాఇంతా కాకుండా పోయాయి.. వున్నా చోట ఉండలేక.. సొంత ప్రాంతానికి వెళ్లలేక.. వందల కిలో మీటర్లు కాలినడకన వెళ్లే పరిస్థితి. చివరకు ఈ అంశం సుప్రీం కోర్టు వరకు చేరింది. అయితే, వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది కేంద్రం. “కరోనా” వ్యాప్తి నివారణకు కేంద్రం జనవరి 17 నుంచే ముందస్తు నివారణ చర్యలు చేపట్టిందని కోర్టుకు తెలిపారు సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా. వలసకూలీల కోసం అన్ని రాష్ట్రాల్లో వసతి గృహాలు ఏర్పాటు, భోజన వసతి, స్క్రీనింగ్, మెడికల్ వసతులు కల్పించామని తెలిపారు సొలిసిటరీ. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాల మేరకు వలసకూలీలను వసతి గృహాలకు తరిలించినట్లు చెప్పారు. అయితే, వలసకూలీలకు వసతి గృహాలు, భోజనం, మెడికల్ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. “ఫేక్ న్యూస్” నివారణకు ప్యానెల్ ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజలకు సమాచారం ఇచ్చేందుకే పోర్టల్ , నిపుణుల కమిటీని 24 గంటల్లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు...