గుడ్‌ న్యూస్‌: బ్యాంకుల్లో కనీస నిల్వ కండీషన్‌ ఎత్తివేత

గుడ్‌ న్యూస్‌: బ్యాంకుల్లో కనీస నిల్వ కండీషన్‌ ఎత్తివేత

బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా కచ్చితంగా కనీస నిల్వ ఉండాలన్న నిబంధనను భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఎత్తివేసింది. ఇప్పటి వరకు గ్రామీణ, పట్టణ ప్రాంత ఖాతాదారులతో పాటు నగర ప్రాంత ఖాతాదారులు కచ్చింగా కనీస నిల్వ ఉండాలని, నిల్వ మొత్తం ఆయా ప్రాంతాన్ని బట్టి బ్యాంకులు నిర్ణయించేవి. ప్రభుత్వ రంగ బ్యాంకులు కాస్త ఉదారంగా ఉన్నా... ప్రైవేట్‌ బ్యాంకులు కనీస నిల్వ ఉంచకపోతే భారీ మొత్తం పెనాల్టీ విధించేది. ఈ కనీస నిల్వ నిబంధనను ఆర్బీఐ ఎత్తివేయడంతో జీరో బ్యాలెన్స్‌తో కూడా ఒక ఖాతా కొనసాగించవచ్చు... ఎలా ఫైన్‌ లేకుండా. అలాగే ఎలాంటి ఫీజు లేకుండా ఏటీఎంతో సహా బ్యాంకు శాఖల నుంచి నెలకు నాలుగు సార్లు విత్‌ డ్రా చేసేందుకు ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నెలకు ఎన్నిసార్లయినా డిపాజిట్లు చేయొచ్చు. అంటే బ్యాంకులో సొమ్ము వేసేందుకు ఎలాంటి ఆంక్షలు లేవన్నమాట. అలాగే ప్రత్యేక సౌకర్యాలు లేని బేసిక్‌ ఖాతా కలిగి ఉన్న ఖాతాదారుకు కూడా చెక్‌ బుక్‌ ఇవ్వాల్సిందేనని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.