పాపం... సంబిత్‌ పాత్రా

పాపం... సంబిత్‌ పాత్రా

టీవీ ఛానల్స్‌ చూసేవారికి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీజేపీ అధికార ప్రతినిధిగా తనకంటూ ఓ స్టయిల్‌ ఏర్పర్చుకున్న ఒడిషాకి చెందిన డాక్టర్‌ సంబిత్‌ పాత్రా. పూరి లోక్‌సభ స్థానం నుంచి ఈయన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. తనదైన స్టయిల్లో ప్రచారం నిర్వహించారు. పేదల ఇంట్లో భోజనం చేయడం, రోడ్డు పక్కన టిఫిన్లు, టీలు తాగడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో స్నానం చేసి... ప్రచారంలో కొత్త పుంతలు తొక్కారు. అయితే నిన్న జరిగిన ఒట్ల లెక్కింపులో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీ బిజూ జనతాదళ్‌కు చెందిన పినాకి మిశ్రా గెలుపొందారు. సంబిత్‌ పాత్రా 11,714 ఓట్లతో తేడాతో ఓడిపోయారు. సంబిత్‌ పాత్రాకు 5,26,607 ఓట్లు రాగా, పినాకి మిశ్రాకు 5,38,321 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన సత్య ప్రకాష్‌ నాయక్‌కు 44,734 ఓట్ల వచ్చాయి.