కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయిందిః డీకే అరుణ

 కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయిందిః డీకే అరుణ

మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానంలో నైతిక విజయం బీజేపీదే అని ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ నాయకులకు చెమటలు పట్టించే విధంగా ఈ ఎన్నికలు జరిగాయని ఆమె తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్, కరీంనగర్‌లో ఓటమికి సీఎం కేసీఆర్ నైతికబాధ్యత వహించాలన్నారు. గతంలో కంటే టీఆర్ఎస్ పార్టీకి తగ్గిన మెజార్టీ గానీ.. ఓడిపోయిన సీట్లను చూస్తుంటే... ఏ క్షణమైనా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కనిపిస్తుందని తెలిపారు. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్తగా మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదన్నారు. దేశంలో రాహుల్ గాంధీయే ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే.. ఇక కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయిందనే చెప్పవచ్చన్నారు. అమిత్ షా, మోడీ నేతృత్వంలో దేశంలో బీజేపి ప్రభంజనం సృష్టించిందని చెప్పారు. కాంగ్రె‌స్‌లో కొనసాగుతున్న నేతలంతా బీజేపిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు.