మిస్టర్ కూల్‌కు సచిన్ షాక్..!
మిస్టర్ కూల్, బెస్ట్ ఫినిషర్‌గా పేరుపొందిన టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ షాక్ ఇచ్చాడు. వరల్డ్‌కప్‌లో ధోనీ ఆటతీరుపై విమర్శలు చేసిన సచిన్ ఇప్పుడు తన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో మిస్టర్ కూల్‌కు చోటు కల్పించలేదు. వరల్డ్ కప్ తర్వాత ప్రపంచకప్ ఎలెవన్ పేరుతో జట్టును ఎంపిక చేసిన మాస్టర్ బ్లాస్టర్... ధోనీకి బదులుగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టోకు తన టీమ్‌లో చోటు కల్పించాడు. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ధోనీయే నంబర్‌వన్ వికెట్ కీపర్‌గా ఉన్నారు. ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం పక్కనపెట్టి.. ఐసీసీ తన టీమ్‌లో భారత జట్టు నుంచే ఇద్దరికి (రోహిత్ శర్మ, బుమ్రా) మాత్రమే చోటు కల్పించగా... దీనికి భిన్నంగా సచిన్.. భారత జట్టు నుంచి ఐదుగురు క్రికెటర్లకు అవకాశం ఇచ్చాడు. టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాకు చోటు కల్పించిన సచిన్... న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌నే తన జట్టు కెప్టెన్‌గా ప్రకటించాడు. మరోవైపు వరల్డ్ కప్ మెగా టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే.
సచిన్ ప్రకటించిన జట్టు:
1. రోహిత్ శర్మ
2. జానీ బెయిర్ స్టో (వికెట్ కీపర్)
3. కేన్ విలియమ్సన్ (కెప్టెన్)
4. విరాట్ కోహ్లీ
5. షకిబ్ అల్ హసన్
6. బెన్‌స్టోక్స్
7. హార్దిక్ పాండ్య
8. రవీంద్ర జడేజా
9. మిచెల్ స్టార్క్
10. జస్ప్రీత్ బుమ్రా
11. జోఫ్రా ఆర్చర్
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)