ఈ సంవత్సరం కూడా లేనట్టేనా బాలయ్య..!!!

ఈ సంవత్సరం కూడా లేనట్టేనా బాలయ్య..!!!

జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు.  ఈరోజున బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించిన న్యూస్ ఏమైనా వస్తుదేనేమో అని అందరు ఆసక్తిగా ఎదురు చూశారు. ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించలేదు.  మోక్షజ్ఞ కు సంబంధించిన ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు.  దీంతో ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన న్యూస్ లేనట్టే అని అర్ధం అవుతున్నది. 

ఇదిలా ఉంటె బాలయ్య 105 వ సినిమా ఈనెల 12 వ తేదీన లాంఛనంగా ప్రారంభం కాబోతున్నది.  సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకుడు.  బాలయ్య కు జోడిగా ఎవరు నటిస్తున్నారు అనే విషయాలు త్వరలోనే ప్రకటించనున్నారు.