ప్లీజ్ ఉల్లి దోసను అడక్కండి... 

ప్లీజ్ ఉల్లి దోసను అడక్కండి... 

దేశంలో ఉల్లి ఘాటు పెంచుతోంది.  రేటు చూస్తే గుండె పోటు వస్తోంది.  రోజు రోజుకు రేటు పెరిగిపోతుండటంతో ఉల్లిని కొనాలంటే ప్రజలు భయపడుతున్నారు. కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో ఉల్లి ధరలు కొండెక్కడంతో అక్కడి రెస్టారెంట్ సిబ్బంది ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఉల్లి ధరలు తగ్గేవరకు బెంగళూరు రెస్టారెంట్ లో ఉల్లి దోసను నిషేదించాలని బెంగళూరు రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఓ తీర్మానం చేసింది.  ఈ తీర్మానం ప్రకారం రేట్లు తగ్గేవరకూ అక్కడ ఉల్లి దోస కనిపించదు.  పాపం బెంగళూరు వాసులకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి.