రాహుల్ ర్యాలీకి అనుమతి లేదు

రాహుల్ ర్యాలీకి అనుమతి లేదు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ 13,14న హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ ఎయిర్ పోర్టు నుంచి నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో 10 నుంచి 20వ తేదీ వరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెడ్అలర్ట్ ప్రకటించామని ఏసీపీ తెలిపారు. అనుమతి లేనిదే ఎయిర్‌పోర్టులోకి ఎవరూ వెళ్లకూడదని పోలీసులు హెచ్చరించారు.  నాలుగు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేపట్టామని చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పది రోజుల పాటు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధించామని తెలిపారు.  ఆదేశాలను ఉల్లంఘిస్తే... చట్టపరమైన చర్యలు తప్పవని శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.