లాక్ డౌన్ పొడిగింపు...కేంద్రం కీలక ప్రకటన

 లాక్ డౌన్ పొడిగింపు...కేంద్రం కీలక ప్రకటన

లాక్‌డౌన్‌ కొనసాగింపుపై వస్తున్న పుకార్లకు కేంద్రం తెరదించింది. ముందు ప్రకటించినట్టుగానే 21 రోజులు మాత్రమే లాక్‌డౌన్‌ ఉంటుందని స్పష్టంచేసింది. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ఎలాంటి ప్రణాళికలూ లేవని తెలిపింది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, ఈఎంఐలపై మారటోరియం వంటివి మూడు నెలల పాటు ఉండడంతో లాక్‌డౌన్‌ కూడా మూడు నెలలు కొనసాగుతుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో తెలియక, నగరాలు, పట్టణాల నుంచి భారీగా సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. ఈ పరిస్థితులన్నీ గమనించిన కేంద్రం లాక్‌డౌన్‌పై స్పష్టత ఇచ్చింది. అన్ని రాష్ట్రాలూ సరిహద్దులు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది.