పబ్లిసిటీకి దూరంగా విక్రమ్ సినిమా.. ఎందుకలా ?

పబ్లిసిటీకి దూరంగా విక్రమ్ సినిమా.. ఎందుకలా ?

తెలుగులో సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రావడంతో చెన్నై వెళ్లి అక్కడ హిట్ కొట్టిన హేర్ విక్రమ్.  అపరిచితుడు సినిమాతో భారీ స్థాయిలో ఫేమస్ అయ్యాడు.  తెలుగులో ఆ సినిమా ఎలాంటి హిట్ సాధించిందో చెప్పక్కర్లేదు.  ఆ తరువాత కొన్ని సినిమాలు బాగానే ఆడాయి.  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఐ సినిమా ఫెయిల్ అయినా.. తెలుగులో బెనిఫిట్ షోలు వేశారు. 

అయితే, గత కొన్ని రోజులుగా విక్రమ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.  రీసెంట్ గా విక్రమ్ మిస్టర్ కెకె సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  జులై 19 వ తేదీన సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.  తమిళ్ లో పబ్లిసిటీ చేసుకుంటున్న ఈ హీరో తెలుగులో మాత్రం ఇప్పటి వరకు పబ్లిసిటీ ఇవ్వలేదు.  సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చాలామంది తెలియడం లేదు.  ఒకవేళ సినిమా బాగుందని టాక్ వచ్చినా పబ్లిసిటీ లేకపోతె ఫెయిల్ అయినట్టే కదా.  ఇప్పటికైనా విక్రమ్ వీలైనంత త్వరగా పబ్లిసిటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది.