పోలింగ్‌ బూత్‌లో సెల్ఫీ దిగితే జైలే..

పోలింగ్‌ బూత్‌లో సెల్ఫీ దిగితే జైలే..

పోలింగ్ రోజు సెలవు తప్పనసరి అని, ప్రైవేటు సెక్టార్‌లో 11వ తేదీన సెలవు ఇవ్వకపోతే సంస్థలపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికార రజత్ కుమార్ స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ లోపల సెల్ఫీ దిగితే జైలు శిక్ష తప్పదన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్నారు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఇక..11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని.. నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతందని రజత్‌ వివరించారు. ప్రగతి భవన్‌లో రాజకీయ కార్యకలాపాలపై ఒక రాజకీయ పార్టీ ఫిర్యాదు చేసిందని.. దాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించామాని చెప్పారు.