రామ్ చరణ్ మేకోవర్ ఇలాగే ఉంటుందా..?

రామ్ చరణ్ మేకోవర్ ఇలాగే ఉంటుందా..?

వినయ విధేయ రామ తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  రామ్ చరణ్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తున్నాడు రాజమౌళి.  ఇద్దరు స్టార్ హీరోలు కావడంతో.. ఇద్దర్ని కొత్తగా చూపిస్తారని అనుకున్నారు.  

రాజమౌళి మనసులో ఆలోచన మాత్రం మరోవిధంగా ఉంది.  ఎన్టీఆర్ ను మాత్రమే కొత్తగా చూపిస్తున్నారట.  మేకోవర్ విషయంలో ఎన్టీఆర్ కొత్తగా కనిపిస్తారని, ఇప్పటి వరకు చూడని లుక్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.  రామ్ చరణ్ ఎప్పటిలాగే మాస్ లుక్ తోనే కనిపిస్తారని.. లుక్ ను చేంజ్ చేయడం లేదని తెలుస్తోంది.  ఎన్టీఆర్ ను ఎలా చూపించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.