అల్లు అర్జున్ 'సభకు నమస్కారం' ఫేక్ న్యూస్ !

అల్లు అర్జున్ 'సభకు నమస్కారం' ఫేక్ న్యూస్ !

'నా పేరు సూర్య' తరవాత నెక్స్ట్ సినిమా ఏమిటో బన్నీ ఇంకా అనౌన్స్ చేయలేదు.  దీంతో రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి.  తాజాగా అల్లు అర్జున్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో సినిమా చేయబోతున్నారని, ఆ చిత్రానికి 'సభకు నమస్కారం' అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలొచ్చాయి. 

కానీ ఈ వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతం తాను నితిన్ 'శ్రీనివాస కళ్యాణం', మహేష్ బాబు, వంశీ పైడిపల్లిల సినిమాలతో బిజీగా ఉన్నానని దిల్ రాజుగారు క్లారిటీ ఇచ్చారు.  మరోవైపు అల్లు అర్జున్, విక్రమ్ కుమార్ ఇద్దరూ  ఉన్నట్టు చాలా రోజుల నుండి వార్తలొస్తున్న విషయం తెలిసిందే.