అవన్ని పుకార్లే... ఆమెకు ఏమి కాలేదు..

అవన్ని పుకార్లే... ఆమెకు ఏమి కాలేదు..

సెలెబ్రిటీల గురించి ఎలాంటి చిన్న న్యూస్ బయటకు వచ్చినా అది వైరల్ గా మారుతుందనే విషయం తెలిసిందే.  ఇలాంటి వాటిల్లో కొన్ని నిజాలు ఉంటాయి మరికొన్ని గాసిప్స్ ఉంటాయి.  నిజమో... గాసిప్పో తెలియదుగాని, సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషా.. రాంజీ షూటింగ్ సమయంలో గాయపడినట్టు వార్తలు వచ్చాయి.  సోషల్ మీడియాలో ఈ వార్త ప్రత్యక్షం కావడంతో వైరల్ గా మారింది.  

దీనిపై త్రిష స్పందించకపోవడంతో ఇది నిజమేమో అనుకున్నారు.  వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో.. త్రిష తల్లి దీనిపై వివరణ ఇచ్చారు.  త్రిష గాయపడినట్టుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్ని కేవలం పుకార్లే అని వివరణ ఇచ్చింది.  తమిళంలో విజయ్ సేతుపతితో చేసిన 96 సినిమా సూపర్ హిట్ కావడంతో.. ఆమెకు వరసగా ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి.  ప్రస్తుతం త్రిష చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి.