ఈడెన్‌లో మ్యాచ్ జరుగుతుందనే ఆశిస్తున్నా: గంగూలీ

ఈడెన్‌లో మ్యాచ్ జరుగుతుందనే ఆశిస్తున్నా: గంగూలీ

భారత్-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డే వేదిక మారడంతో బీసీసీఐపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రెండో్ వన్డేకు ఇండోర్‌ హోల్కర్ స్టేడియం ఆతిథ్యమివ్వాలి. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు, బీసీసీఐకి మధ్య కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో వివాదం తలెత్తడంతో రెండో వన్డే విశాఖకు మారింది. దీనిపై  టీమిండియా మాజీ కెప్టెన్‌, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించాడు.

'కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో మధ్యప్రదేశ్‌ క్రికెట్‌  సంఘానికి మద్దతు తెలుపుతున్నాను. మ్యాచ్‌ల నిర్వహణకు ఆ రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం అవసరం. పోలీసులు, కార్పొరేషన్, ఫైర్ బ్రిడ్జ్, గ్రౌండ్ స్టాఫ్ ఇలా మరెందరో సాయపడతారు. వాళ్లందరికీ మేం కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం 10 శాతం అయితే వాళ్లందరికీ మేము కాంప్లిమెంటరీ పాసెస్ ఇవ్వలేం. ఈ విషయంలో బీసీసీఐ ఏం చేయాలనుకుంటోందో అర్థం కావడం లేదు. మ్యాచ్‌ను తరలించాలనుకుంటే తరలించనివ్వండి. మేమైతే ఈ విషయంలో రాజీపడం' అని గుంగూలీ స్పష్టం చేశారు.

'67,000 సామర్థ్యం ఉన్న ఈడెన్‌లో 30,000 టిక్కెట్లు కాంప్లిమెంటరీ పాసెస్ అయితే అందరికీ సర్దగలం. ఈడెన్‌లో జరిగే తొలి టీ-20(నవంబర్ 4) టికెట్లు ఇప్పటికే ప్రింటింగ్ కోసం వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు ఏమీ చేయలేం. ఈడెన్‌లో మ్యాచ్ జరుగుతుందనే ఆశిస్తున్నా' అని గంగూలీ తెలిపారు.