ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ కు నిరాశేనా..?

ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ కు నిరాశేనా..?

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తారని అనుకున్నారు.  కానీ, దీనికి సంబంచిందిన ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేయలేదు.  దీంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.  ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ మూవీనుంచి ఏదో ఒక అప్డేట్ తప్పకుండా వస్తుందని ఆశపడ్డారు.  

ముఖ్యంగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రకు సంబంధించి ఏదైనా ఒక చిన్న లుక్ ను రిలీజ్ చేస్తారని ఆశించారు.  సోషల్ మీడియాలో ఈ దిశగానే ప్రచారం జరిగింది. ఈ ఉదయం నుంచి ఫ్యాన్స్ ఎదురు చూశారు.  కానీ, ఎలాంటి లుక్ రిలీజ్ చేయడం లేదని తెలియడంతో నిరాశ చెందారు.  అయితే, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇదొక ఊరట అనుకోవచ్చు.