అవిశ్వాసంపై ఓటింగ్ జరగదా?

అవిశ్వాసంపై ఓటింగ్ జరగదా?

ఇవాళ లోక్ సభలో కేంద్ర సర్కారుకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాల వాదనలు, ప్రభుత్వం వివరణ తర్వాత ఓటింగ్ నిర్వహించడం ఆనవాయితీ. అయితే నేడు ఓటింగ్ జరగదా? అనే సందేహం తలెత్తుతోంది. పార్టీల తీరు చూస్తుంటే సభలో ఓటింగ్ లో పాల్గొనే సూచనలు కనిపించడం లేదని ప్రముఖ పాత్రికేయులు రాజ్ దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడుతున్నారు. అవిశ్వాసంపై ఓటింగ్ కు ముందు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి వాకౌట్ చేయవచ్చని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.  అదే జరిగితే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది తప్ప ఓటింగ్ జరగదని ఆయన చెప్పారు.